గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ ట్రాన్స్ఫర్ విషయంలో స్పందించండి.
-గెజిటెడ్ లెక్చరర్స్ డిమాండ్
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్13(జనంసాక్షి)తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ టిజిజెఎల్ఏ-475 యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ట్రాస్ఫర్స్ పైన స్పందించాలని డిమాండ్ చేస్తూ గార్ల జూనియర్ లెక్చరర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వేముల రవీందర్, గొడుగు సోమన్న, సత్యనారాయణ, తోట నాగేశ్వరరావు, డాక్టర్ ఉశికమల్ల శ్రీనివాస్, అడపాల ప్రసాద్, జి రాంబాబు, సుజాత తదితరులు పాల్గొన్నారు.