ముదిరాజులే రారాజులురాజకీయంగా ఎదగాలి చైతన్యవంతులు కావాలి
-పురవీధుల గుండా భారీ ర్యాలీ
-నియోజకవర్గ ముదిరాజుల చైతన్య సదస్సులో నినదించిన పలువురు వ్యక్తలు
మానకొండూరు, అర్ సి, సెప్టెంబర్, (13 జనం సాక్షి) :ముదిరాజులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, వెనుకబడి నా, మనమందరం సమిష్టి ఐక్యత చాటి, ముదిరాజులకు సరియైన ప్రాధాన్యత దక్కేంతవరకు, కలసికట్టుగా అలుపెరుగని పోరాటం చేయాలని బుధవారం మానకొండూరు లో జరిగిన మానకొండూరు నియోజకవర్గ ముదిరాజుల చైతన్య సదస్సు లో పలువురు వ్యక్తలు అభిప్రాయపడ్డారు. 58 లక్షల మంది జనాభా ఉన్నా, రాష్ట్రంలో 115 అసెంబ్లీ స్థానాలలో ఏ రాజకీయ పార్టీ సీటు కేటాయించకపోవడం పట్ల మండిపడ్డారు. ముదిరాజ్ సంఘ నియోజకవర్గ అధ్యక్షులు కీసరి సదానంద్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన మానకొండూరు నియోజకవర్గ ముదిరాజ్ చైతన్య సదస్సు లో పలువురు తమ ఐక్యత గళం వినిపించారు. 67 వేల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, మానకొండూరు మండలంలో 23 సహకార సంఘాలు ఉన్నాయని, మనమందరం మనకు ప్రాధాన్యత కల్పించిన రాజకీయ పార్టీకే మద్దతు తెలపాలనే, మూకుమ్మడి నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. మానకొండూరు నియోజకవర్గంలోని మండలాల నుండి ముదిరాజ్ సామాజిక సోదరులు మానకొండూరుకు చేరుకున్నారు. డీజే లతో పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి వారి ఐక్యతను, బలాన్ని బలగాన్ని, చాటారు. మానకొండూరులో లోని ఓ వేడుక మందిరంలో నిర్వహించిన, మానకొండూర్ నియోజకవర్గ ముదిరాజుల చైతన్య సదస్సు సభాస్థలికి ర్యాలీగా తరలి వెళ్లారు. పలువురు వ్యక్తలు ప్రసంగిస్తుండగా జై ముదిరాజ్, జై జై ముదిరాజ్ అంటూ సభాస్థలి హోరెత్తింది. భారీ సంఖ్యలో ముదిరాజ్ సామాజిక వర్గ సోదరులు హాజరు కావడంతో సమావేశ మందిరం కిక్కిరిసిపోయింది. పాలక పార్టీలు తమ సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నాయని పలువురు వ్యక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మనమందరం ఐక్యంగా ఉండి సత్తా చాటి, రాజకీయరంగంలో తమ వాటా తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు పెసరు కుమారస్వామి ముదిరాజ్,మాల కనుకయ్య ముదిరాజ్,ఎరవేని రామాంజనేయులు,కునాచుల మహేందర్, నెల్లి శంకర్ ముదిరాజ్, కీసర సంపత్ ముదిరాజ్, మామిడి తిరుపతి ముదిరాజ్,చొప్పరి రాంచంద్రం, కూన శంకర్ ముదిరాజ్, బైక రాజమౌళి,బొజ్జ తిరుపతి, మామిడి సతీష్,రాగుల మొండయ్య,గట్టు శ్రీధర్,పల్లె రాజశేఖర్,పిట్టల మధు,బోయిని వెంకటేష్,గూడెల్లి ఆంజనేయులు,అక్కర పోచయ్య,నెల్లి మురళి,పప్పు సమ్మయ్య,గొల్ల శ్రీనివాస్,కుడుముల నాగరాజు,గొడుగు నర్సయ్య,నెల్లి శ్రీనివాస్ తో పాటు నియోజకవర్గం లోని , ముదిరాజ్ ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు ,మాన కొండూరు నియోజకవర్గ మత్స్య కార్మికులు, ముదిరాజ్ సామాజిక వర్గ సోదరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.