స్థానికులకె టికెట్ ఇవ్వాలి

-ఈటెలను కోరిన అచ్చంపేట నియోజకవర్గ స్థానిక రాజ్యాధికార పోరాట సమితి నాయకులు

అచ్చంపేట ఆర్సీ, 13 సెప్టెంబర్ ,జనం సాక్షి న్యూస్ : పట్టణంలో
బుధవారం నాడు నిర్వహించిన భాజపా కార్యకర్తల ముఖ్యనాయకుల నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ సమావేశానికి హాజరైన
పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కు అచ్చంపేట నియోజకవర్గం నుండి బిజెపి పార్టీలో స్థానికులకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ అచ్చంపేట నియోజకవర్గ స్థానిక రాజ్యాధికార పోరాట సమితి నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మీసాల విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గత 70 సంవత్సరాల నుండి రాజ్యాధికారాన్ని పొందలేకపోయిన అచ్చంపేట నియోజకవర్గ స్థానిక దళితులకు భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ కేటాయించి స్థానిక దళితులకు న్యాయం చేయాలని కోఋతున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదమే స్థానికత ప్రాధాన్యం మీద కొనసాగిందని కావున మా ప్రాంతాన్ని మీ మేలుకుంటాం మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని ఆత్మ గౌరవ నినాదంతో మొదలై న ఉద్యమంలో మీరు క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అదే స్ఫూర్తితో 70 సంవత్సరాలుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్న ఇక్కడి స్థానిక దళితులు మా స్ధానిక అభ్యర్థి కే మా ఓట్లు వేసుకుంటాం మమ్మల్ని మేము పాలించుకుంటాం అనే నినాదంతో ఉద్యమం చేయడం చేస్తున్నామని తెలిపారు. ఇటీవలే అన్ని ప్రధాన పార్టీల ముఖ్యనాయకులకు ఇదే అంశంపై వినతిపత్రాన్ని ఇచ్చినట్లుగా నే బీజేపీ కూడా ఆత్మగౌర నినాదాన్ని గుర్తించి స్థానిక దళితులకే భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్టు కేటాయించాలని కోరామని తెలిపారు. కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ స్థానిక రాజ్యాధికార పోరాట సమితి నాయకులు పోలె రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు