సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి జి. ఉత్తరయ్య లోకదాలత్ డిఫెన్స్ కౌన్సిల్
వనపర్తి బ్యూరో సెప్టెంబర్13 (జనం సాక్షి)ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వనపర్తి లోక్ అదాలత్ డిఫెన్స్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య అన్నారు. బుధవారం వనపర్తి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో లోకదాలత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ పిల్లలు వాహనాలు నడప రాదని వివరించారు, నిర్దేశిత వయసు ప్రకారం లైసెన్స్ కలిగి ఉండాలని వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని త్రిబుల్ రైడింగ్ చేస్తే చట్ట వ్యతిరేకం అవుతుందని వివరించారు. మైనర్లకు వివాహం చేస్తే చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. బాలలు పనులకు కాకుండా బడికి వెళ్లి ప్రయోజకులు కావాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలతో విద్యా అభ్యసించి స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ నిర్వాహకురాలు ఎం కవిత, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు డేగల కృష్ణయ్య, న్యాయవాది నరేందర్ బాబు, వసతి గృహాల అధికారులు జి.ఎస్. రాజు, సత్యనారాయణ మరియు లోక్ అదాలత్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.