కమున్యిటి హాల్ నిర్మాణం కొరకు ప్రొసీడింగ్ అందజేసిన
ఎమ్మెల్యే డాక్టర్.వి.యం.అబ్రహం
అలంపూర్ సెప్టెంబర్ 13(జనంసాక్షి )అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోబుధవారం ఐజ ఉప్పరి సంఘం వారికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన కాపీని వారికి ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలు, అన్ని కులాలు మరియు అన్ని వర్గాల వారిని సమన్యాయం చేస్తూ వారి అభివృద్ధి కి కృషి చేస్తున్నారు వారి ఆదర్శంగా నిలుస్తున్నారు అన్నారు.అలంపూర్ నియోజక వర్గంలో అన్ని కులాలు మతాల వారికి సామాజిక అభివృద్ధి కొరకు సామాజిక భవనాల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేస్తున్నాము అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు మరియు BRS పార్టీ నాయకులు, నాయి బ్రాహ్మణ సంఘం వారు తదితరులు పాల్గొన్నారు.