వినాయక విగ్రహాలు పెట్టేవారు పర్మిషన్ తప్పనిసరి-టేకులపల్లి ఎస్సై గన్ రెడ్డి రమణారెడ్డి
టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): వినాయక చవితి సందర్భంగా ఉత్సవం కమిటీ భక్త బృందం వినాయక విగ్రహాలు పెట్టాలి అనుకునే వారు తప్పనిసరిగా పర్మిషన్లు తీసుకోవాలని టేకులపల్లి ఎస్సై గన్ రెడ్డి రమణారెడ్డి సూచించారు.కరెంట్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్, మైక్ పర్మిషన్ కోసం మీసేవ నందు డిడి, గ్రామ పంచాయతి నుండి అనుమతి పత్రాలలో పాటు, నమోదు చేసిన వివరాలను ప్రింట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి వచ్చిన వారికి మాత్రమే పోలీస్ స్టేషన్ నుండి అనుమతులు లభిస్తుందని ఎస్ఐ తెలిపారు. అట్టి విషయాన్ని ప్రజలు, వినాయక ఉత్సవ కమిటీ భక్తమండలి గమనించి సహకరించి వినాయక విగ్రహాలు పెట్టాలి అనుకునే వారు తప్పకుండా ఆన్లైన్ చేసుకోవాలన్నారు. ఆన్లైన్ చేసుకోకుండా వినాయక విగ్రహం అనుమతించబడమని, అలాంటి వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందిఅన్నారు.