ఈనెల 16న నిర్వహించే బీఎస్పీ ర్యాలీ
మహాసభను విజయవంతం చేయాలి.
తాండూర్ అసెంబ్లీ ఇన్చార్జ్ దొరిశెట్టి సత్యమూర్తి
తాండూరు సెప్టెంబర్ 13(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16న తాండూరు పట్టణంలోని కొడంగల్ రోడ్డు మార్గంలో గల ఎస్వీఆర్ గార్డెన్ లో బిఎస్పీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సభకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతం ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు చంద్రశేఖర్ ముదిరాజ్ అభిమానులు, బహుజనులు అధిక సంఖ్యలో హాజరై
సభను విజయవంతం చేయాలని కోరారు. మొదటి సారి తాండూర్ కు విచ్చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కు ఘన స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా మైనార్టీ నాయకులు అంజాద్ అలీ భాష, నాయకులు అరుణ్ రాజ్ అఖిల్ బాబా, పాండు , కృష్ణయ్య గౌడ్, మక్సుద్, అశ్వాక్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.