బడుగు బలహీన వర్గాల నాయకుడు బీసీ దళపతి ఆర్ కృష్ణయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వికారాబాద్ ప్రాంత బీసీ సంఘం నాయకులు
వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 13 జనం సాక్షి
బహుజనులకు రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాటాలు చేయాలని బీసీల హక్కుల సాధన కోసం జాతీయస్థాయిలో పోరాటాలు చేయడానికి నీ వెంటే మేమంతా అని వికారాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదగిరి యాదవ్ పేర్కొన్నారు బుధవారం నగరంలో నీ బీసీ భవన్ లో
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య జన్మదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు యాదగిరి యాదవ ఆధ్వర్యంలో వికారాబాద్ నుంచి వందల సంఖ్యలో యువకులు ఆర్ కృష్ణయ్య నివాసంకు చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి శాలువాతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య ఇంకా మరెన్నో పదవులు అలంకరించాలని బీసీల పక్షపాతిగా నిలుస్తున్న ఆర్ కృష్ణయ్య ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజ్ కుమార్ లాల్ కృష్ణ ప్రసాద్ మాజీ ఎంపిటిసి రాములు బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి గంగులు సంగయ్య ప్రశాంత్ శివకుమార్ వికారాబాద్ యువకులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు