అంగన్వాడిటీచర్లు,వర్కర్స్ వేతనాలను ప్రభుత్వం వెంటనే పెంచాలి

* అంగన్ వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం
* ప్రజలకు మేలు చేసేందుకు అంగన్ వాడి వ్వవస్ధ ను తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ
* గర్భిని స్త్రీలకు తల్లిలా,చంటి పిల్లలకు తల్లి లా పెంచేది అంగన్ వాడీ వ్యవస్ధ మాత్రమే
* టీపీసీసీ సభ్యులు చీమల వెంకటేశ్వర్లు

టేకులపల్లి, సెప్టెంబర్ 13 (జనం సాక్షి ): మండల కేంద్రంలో తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్ వాడి ఉద్యోగులు గత 3 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మెకు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టిపిసిసి సభ్యులు చీమల వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, వర్కర్స్ వేతనాలు వెంటనే పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేసేందుకు అంగన్వాడీ వ్యవస్థను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకువచ్చిందని, ఆనాటి నుండి అరకొర జీతాలతో ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతూ సోషల్ సర్వీస్లాగా చేస్తూ గర్భిణీ స్త్రీలకు తల్లిలా, చంటి పిల్లలకు తల్లిలా నిత్యం అలనా పాలన చూసుకుంటున్నారని, అలాంటి వారి న్యాయమైన సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని అన్నారు. ప్రభుత్వాలు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి అంగన్వాడి టీచర్లను, వర్కర్లను వినియోగించుకోవడం జరుగుతుందని, వారికి వేతనాలు పెంచడం చాలా ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, శాసనసభ ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువెళ్లి అంగన్వాడీల నిరసన దీక్షకు తమ మద్దతు ఉంచుతూ వారి సమస్య నెరవేర్చే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామన్నారు. గత మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర

తాజావార్తలు