వికారాబాద్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ విజయం ఖాయం
వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 13 జనం సాక్షి
వికారాబాద్ నియోజకవర్గంలో పాటు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని జిల్లా యువజన కాంగ్రెస్ యువ నాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుందని అన్నారు వికారాబాద్ ప్రాంతంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించి తీరుతారని ఆయన తెలిపారు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించడం ఖాయమన్నారు బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ప్రజలు విసుకు చెందారని ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బి ఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ లో వలసలు గా ఇతర పార్టీల కార్యకర్తలు చేరుతున్నారని ప్రజా ఆదరణ పెరిగి కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ఎదిగింది అన్నారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ప్రసాద్ కుమార్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు