భూమి ఫౌండేషన్ కు ప్రశంసలు

-ఆనందం వ్యక్తం చేసిన జనం
బిచ్కుంద సెప్టెంబర్ 13 (జనంసాక్షి)
ఆయుష్మాన్ భవన్ ప్రోగ్రాంలో భాగంగా క్షయ ముక్త్ భారత్ అభినయ్ సందర్భంగా బిచ్కుంద మండల భూమి ఫౌండేషన్ వారికి (మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) ద్వారా భూమి ఫౌండేషన్ చేస్తున్న సేవలకు డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మణ్ సింగ్ చేతుల మీదుగా బుధవారం నాడు ప్రశంస పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం డిస్టిక్ ఆఫీసర్ డాక్టర్ రాధిక, ప్రోగ్రాం ఆఫీసర్ శిరీష, కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపర్డెంట్ విజయలక్ష్మి, డిస్టిక్ పబ్లిక్ ప్రైవేట్ సమన్వయ కర్త శోభారాణి మరియు పిట్ల సాయిలు, హుండే బస్వరాజ్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు