కన్న కొడుకును చంపిన తల్లికి జీవిత ఖైదు
ఏర్గట్ల సెప్టెంబర్ 13 (జనంసాక్షి); నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన గుండ నవ్య అలియాస్ లావణ్య, అభిషేక్ భార్యాభర్తలు భర్త అభిషేక్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్ళడంతో భార్యాభర్తలకు చిన్నచిన్న విభేదాలు రావడంతో తన కొడుకుతో కలిసి తన పుట్టింటి గ్రామమైన తోర్థిలో తల్లివద్దే ఉండేది కాలేజీలో పరిచయమైన తన ప్రియుడుతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ తన భర్త గల్ఫ్ లో ఉన్నందున ఇదే అదునుగా భావించి 20/ 12/20 రోజున కొడుకును అడ్డుగా తొలగించుకోవాలని గొంతు నులిమి చంపి వేయడం జరిగినది. ఈ వార్త అప్పట్లో జిల్లా మొత్తం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసినదే, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి బాలుడి తల్లిని దోషిగా నిర్ణయించె సాక్షాలను కోర్టుకు ప్రవేశపెట్టారు. అనంతరం న్యాయామూర్తి సాక్షాలను పరిశీలించి కన్నతల్లి అయినా నవ్యకు యావజీవ కారాగార శిక్ష విధించరు.ఈ కేసును చేదించిన పోలీసులకు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులు ప్రకటించరు.