కడియం శ్రీహరీ మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే జర చెప్తారా?
కలిసి పని చేద్దాం అభివృద్ధి చేసుకుందాం- రాబోయేది మన కాంగ్రెస్ ప్రభుత్వమే: కాంగ్రెస్ నేత డాక్టర్ బొల్లెపల్లి కృష్ణ.
జనగామ (జనంసాక్షి) సెప్టెంబర్13: చిన్నపెండ్యాల గ్రామంలో హత్ సే హత్ జోడో పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత డాక్టర్ బొల్లెపల్లి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తదని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకి నీళ్లు వస్తాయి అని, రాష్ట్రంలో ప్రతి ఊరిలో అభివృద్ధి జరుగుతుందని,దానికి నిధులు వస్తాయి అని ,మనం అందరం కేసీఆర్ చెప్పినటువంటి మాటలు నమ్మి వందల మంది విద్యార్థులు చనిపోయారని, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది . కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నది ఎవరో ఒకసారి మీరు ఆలోచించండి అన్నారు. ఎంతోమంది ఉద్యమం చేస్తే తాను ఒక్కడినే ఉద్యమం చేసిన అని చెప్పిన కేసీఆర్ తర్వాత తెలంగాణను బాగు చేస్తానని చెప్పితెలంగాణ ప్రజల బతుకులన్నీ బుగ్గిపాలు చేశారని మండిపడ్డారు. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉండే 2014 నుంచి ఈ టీఆర్ఎస్ పాలన ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని, 108 అంబులెన్స్, విద్యార్థులు చదువుకోడానికి ఫీజు రీఎంబర్స్మెంట్, భూమి లేని పేదలకు భూమి,సబ్సిడీలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2014 నుంచి ఇప్పటివరకు బంగారు తెలంగాణలో కేసీఆర్ మాటలు నమ్మి ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయని ప్రశ్నించారు. ఎంతమంది పేదవాళ్లకు డబుల్ బెడ్ రూమ్లు, దళిత బందు, అలాగే దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినా ఒకమాట కూడా చెయ్యలేదు అని విమర్శలు గుప్పించారు. కెసిఆర్ చెప్పేది అన్నీ అబద్ధాలే అన్నారు. మరోసారి కేసీఆర్ ఎత్తులకు మోసపోవద్దన్నారు. బంగారు తెలంగాణ రూ. 5 లక్షల కోట్ల అప్పులలో ఉందని, అలాంటి స్థితిలో ఉన్న రాష్ట్రం బంగారు తెలంగాణ అని ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో చిన్న పెండ్యాల గ్రామ సీనియర్ నాయకులు తల్లపెళ్ళి రాజయ్య, ఇల్లందుల వెంకటస్వామి, తాటికాయల యాదగిరి, కొత్తల కుమార్, చుక్క ఆగయ్య, ఇల్లందుల చిల్పూర్ మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇల్లందుల అనిల్, గ్రామ యూత్ నాయకులు ఇల్లందుల సురేష్, చుక్క రాజు, చిలక రాకేష్, చుక్క సుమన్, మచ్చ బన్నీ, మాధారపు ప్రశాంత్, జఫర్గడ్ మండల మాజీ జెడ్పిటిసి పట్టపురి సదయ్య గౌడ్, ఉమ్మడి జిల్లా ఓబీసీ సెల్ మాజీ అధ్యక్షులు అయ్యప్ప శీను,ధర్మసాగర్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పాని సంపత్, ముప్పారం గ్రామ సీనియర్ నాయకులు కొరివి సతీష్,రాజు తదితరులు పాల్గొన్నారు.