రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువకుడి దారుణ హత్య

 

వేములవాడ,జనం సాక్షి: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు చందుర్తి మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్యాల గ్రామానికి చెందిన పడిగేల నరేష్( 25) అనే యువకుడుని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు, ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది ,మృతుడు గత వారం రోజుల క్రితం గల్ఫ్ నుండి వచ్చినట్లుగా తెలిపారు, సంఘటన స్థలానికి సిఐ కిరణ్ కుమార్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

తాజావార్తలు