యాచారం మండల కేంద్రం లో గానుగ నూనె తయారీ కేంద్రంప్రారంభం

-గానుగ నూనె వైపు మెుగ్గు చూపుతున్న ప్రజలు

-ఆరోగ్య ప్రధాయినిగా సాంప్రదాయ వంట నూనె

-యాచారం మండలం ఎం పి పి కొప్పు సుకన్య బాషా, జెడ్పిటి సి చిన్నోల జంగమ్మ యాదయ్య,
బిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్

ఇబ్రహీంపట్నం,సెప్టెంబర్ 13 (జనంసాక్షి):-యాచారం మండల కేంద్రం లో కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామానికి చెందిన విజయ లక్ష్మి అధ్యర్యం లో ఏర్పాటు చేసిన గానుగ నూనె తయారీ కేంద్ర ప్రారంబోత్సవం లో యాచారం మండలం ఎం పి పి కొప్పు సుకన్య బాషా,జెడ్ పి టి సి చిన్నోల జంగమ్మ యాదయ్య,బిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఇప్పుడంతా ఉరుకులు పరుగుల జీవితం, తీరికలేని పనులతో కాలంతో పరుగెత్తాల్సి వస్తోంది,అని దీంతో అనేక అనారోగ్య సమస్యలు మనల్ని వేధిస్తున్నాయని దీనికి తోడు కొత్త వైరస్‌లు,వేరియంట్లు అంటూ రోజుకో జబ్బు పుట్టుకొస్తోంది అని,ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఏ ఆహారం వండాలన్నా నూనె వాడడం తప్పనిసరి,తినే ఆహారం రుచిగా ఉండాలంటే వంట నూనె మంచిదై ఉండాలి అని అన్నారు.దీంతో కల్తీ ఆహారానికి దూరంగా ఉంటూ పాత పద్ధతిలో ఆహార పదార్థాలు తయారు చేసుకోవాటనికి ప్రజలు మెుగ్గు చూపుతున్నారని,ఆరోగ్యంపై దృష్టి సారించి గానుగ నూనె రుచి చూస్తున్నారు అని అన్నారు.ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్నకొద్దీ రసాయనాలు వాడకుండా తయారు చేసే కట్టె గానుగ వంట నూనెలకు తిరిగి ఆదరణ పెరుగుతోంది అని అన్నారు.ఈ సందర్బంగా గానుగ నూనె ఫ్యాక్టరీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి గుర్రం విజయ లక్ష్మి నరేష్ మాట్లాడుతు ప్రస్తుతం మారుతున్న జీవనశైలీలో రిఫైన్డ్ చేసిన ప్లాస్టిక్ కవర్లలో లభించే నూనెలు వచ్చి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి,తినే నూనె లో పోషకాలు తగ్గడంతో ప్రజలు వ్యాధుల బారిన పడాల్సీవస్తోంది.దీంతో మళ్లీ పాతపద్దతులలో చెక్క గానుగ నూనెలను ఉపయోగించేంధుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు అన్నారు.పల్లీలు,నువ్వులు,కొబ్బరి, ప్రోద్దుతిరుగుడు,కుసుమ లాంటి వాటితో సంప్రదాయ పద్ధతి ద్వారా నూనెను తయారు చేస్తున్నామని,గానుగ నూనెలను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తయారు చెయ్యడం వల్ల అందుకే వాటికి చక్కటి రుచి,సువాసన లతో పాటుగా పోషకాలు చెక్కు చెదరకుండా ఉంటాయని,సహజంగా నూనె గింజల లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్లు-ఈ, ఒమేగా-3,ఒమేగ-6, ఫ్యాటియాసిడ్లు,బయేఫైనాడ్లు మొదలగునవి గానుగ నూనెల్లో పుష్కలంగా ఉంటాయి అని,అందువల్ల గానుగ నూనె వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.కావున కల్తీనూనె అనేది ఏవిధంగా ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు,మావద్ద పల్లి నూనె,కొబ్బరినూనె,నువ్వుల నూనె,బద్దంనూనె,కుసుమ నూనెలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.అందుకే అందరికీ అందుబాటులో తెచ్చేందుకు యాచారం లో గానుగ నూనె తయారి సంస్థను నెలకొల్పమన్నారు.ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాల సర్పంచులు,ఎం పి టి సి లు,ఉపసర్పంచులు,వార్డు సభ్యులు తధితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు