గీత కార్మికుల మహా ధర్నా పోస్టర్ ఆవిష్కరణ..

కేసముద్రం-సెప్టెంబర్ 13- జనం సాక్షి : మండల కేంద్రంలో కేజీకేఎస్ మండల అధ్యక్ష,కార్యదర్శులుఉప్పలయ్య,వెంకటేశ్వర్లు,గోపా డివిజన్ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ మహాధర్నా పోస్టర్,కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో కళ్ళు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఐదు లక్షల కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న హైదరాబాదులో నిర్వహించే మహా ధర్నాకు గీత కార్మికులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు నాయకులు గడ్డం యాక మూర్తి,ఉమ్మ గాని మల్లయ్య,గంధం వెంకన్న, చింతనూరి వెంకన్న,కదిరే సోమయ్య,రాగళ్ల వెంకన్న,మాచర్ల కొమురయ్య,బుర్ర కుమారస్వామి,యాసారపు ప్రభాకర్,ఉప్పలయ్య, బొమ్మెర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు