ఎమ్మెల్యే ని కలిసిన మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి.
తాండూర్ సెప్టెంబర్ 14( జనంసాక్షి) నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యులు హైదరాబాదులోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే ను కలిసి ఘనంగా సన్మానించారు .నూతన చైర్మన్ గద్దె వీణ శ్రీనివాస్ చారి ఎమ్మెల్యేకి శాలువాతో సత్కరించి బొకే అందజేశారు.నూతన మార్కెట్ కమిటీ వీణ శ్రీనివాస్ చారి వైస్ చైర్మన్ ఉమాశంకర్ పటేల్ లను ఎమ్మెల్యే సన్మానించారు.ఈ సందర్భంగా నూతన మార్కెట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాపై నమ్మకంతో మార్కెట్ కమిటీ బాధ్యతలను ఇచ్చినటువంటి ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాండూర్ మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పథంలో నిలుపు తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నయీమ్ అప్పు, యాలాల్ మండల్ ఎంపీపీ బాలేశం గుప్తా , వికారాబాద్ జిల్లా కోఆప్షన్ మెంబర్ అధ్యక్షుడు అక్బర్ బాబా, తాండూర్ మండల్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రామలింగారెడ్డి , మహిళా కన్వీనర్ శకుంతల, ప్రధాన కార్యదర్శి రాకేష్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు హరిహర గౌడ్, మంత్రి వెంకటయ్య, శ్రీనివాస్ గౌడ్, పేర్కంపల్లి వెంకట్, రేలగడ్డ తాండ గోవింద నాయక్, ముస్తఫా కోకట్, షేక్ ఖాసిం అలీ, మ్యాతరి ప్రకాశ్ , గోపాల్ రెడ్డి, కుర్వ బీరప్ప, భాను ప్రసాద్, ప్రశాంత్ గౌడ్ మరియు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.