ఏడిఏ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన ఏవో లావణ్య కు ఘన సన్మానం..

-శాలువాతో సన్మానిస్తున్న లయన్స్ క్లబ్ అధ్యక్షులు కనుక సంజీవ్..

మల్లాపూర్ సెప్టెంబర్12( జనం సాక్షి)
మల్లాపూర్ మండల అగ్రికల్చర్ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న లావణ్య కు మెట్పల్లి డివిజనల్ ఏడీఏగా అదనపు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మల్లాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కనుక సంజీవ్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కనుక సంజీవ్ మాట్లాడుతూ ఏవో లావణ్య మెట్పల్లి ఏడీఏగా బాధ్యతలు స్వీకరించి రానున్న రోజుల్లో జిల్లా స్థాయి అధికారినీగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ గజానంద్, వంశీ, లయన్స్ క్లబ్ సభ్యులు, మోర సతీష్, పుప్పల మహేష్, తిప్పర్తి రామకిషన్, ఆడేపు ఆనందు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు