మండల స్థాయి ఎఫ్ ఎల్ ఎన్ శిక్షణా కార్యక్రమం ప్రారంభం-డి ఆర్ పి. రాజు నాయక్

మద్దూరు సెప్టెంబర్ 14 (జనం సాక్షి)మండల స్థాయి ఎఫ్ ఎల్ ఎన్ 6 రోజుల శిక్షణ కార్యక్రమం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభించారు .
ఈ కార్యక్రమంలో మండల నోడల్ ఆఫీసర్ అబ్దుల్ సమద్ , మద్దూరు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు , డిఆర్పిలు రాజు నాయక్ , జానకిరామ్ , ఎమ్మార్పీలు రాఘవేందర్ , మల్లికార్జున్ తిరుపతిరెడ్డి , నారాయణ మరియు వివిధ పాఠశాలల నుండి శిక్షణ నిమిత్తం వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులలో మౌలిక భాషా గణిత సామర్థ్యాలను పెంపొందించే విధంగా బోధన అభ్యసన కృత్యాలను ఎలా నిర్వహించవచ్చు అంశాలను ఆర్పీలు చాలా చక్కగా వివరించారు.

తాజావార్తలు