భాజపా ఆధ్వర్యంలో మేరా దేశ్ మేరా మాటి
వనపర్తి బ్యూరో సెప్టెంబర్14 (జనం సాక్షి)వనపర్తి మండల పరిధిలోని సవాయిగూడెం గ్రామంలోని బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు దాసరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మేరా దేశ్ మేరా మాటి కార్యక్రమంలో భాగంగా ఇంటింటా మట్టిని బియ్యము సేకరించారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు పార్టీలకతీతంగా జాతీయ జెండా చేత భూమి దేశవ్యాప్తంగా ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 15 వరకు దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవానులకు ,స్వాతంత్ర సమరయోధులకు గుర్తుగా దేశ రాజధాని ఢిల్లీలో యుద్ధ అమరవీరుల స్మారకం పక్కన దాదాపు 500 ఎకరాల స్థలంలో అమరవీరుల స్మృతి వనం మరియు స్మారకం ఏర్పాటు చేయడానికి భారత దేశంలోని ప్రతి గ్రామము నుండి బియ్యపు గింజలు,మట్టిని మరియు మొక్కలను సేకరించి దేశవ్యాప్తంగా 7500 అమృత కలశాలతో ఢిల్లీలో 75 వేల మొక్కలతో స్మృతి వనాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుందని వనపర్తి రూరల్ మండలంలో కూడా గత నెల 15వ నుండి ప్రతి గ్రామంలో మేరా దేశ్ మేరా మాటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇంకా కార్యక్రమాన్ని నిర్వహించని గ్రామాలలో 15వ తేదీ వరకు ఒక కార్యక్రమాలు పూర్తి చేసి దేశ రాజధాని ఢిల్లీకి పంపించడం జరుగుతుందని ఇంతటి పవిత్రమైన కార్యక్రమంలో పాలుపంచుకునేలా అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరూ కృతజ్ఞతలుగా ఉంటారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామన్న గారి వెంకటేశ్వర రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇన్ఛార్జి పెద్దిరాజు మండల అధ్యక్షులు సర్పంచ్ ఎద్దుల దేవేందర్ బూత్ కమిటీ అధ్యక్షుడు దాసరి లక్ష్మారెడ్డి మధు మోహన్ రెడ్డి, బద్రి, వంశీ, బాలరాజ్ ,చరణ్, అరవింద్ రెడ్డి, పెద్ద మనుషులు నాగిరెడ్డి, పెంటయ్య, చంద్రయ్య ,వెంకటరెడ్డి, వడ్డే లక్ష్మయ్య గ్రామస్తులు అందరు పాల్గొన్నారు