భైంసా పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్ తో నిరసన
భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 14నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్ ఆధ్వర్యంలో భైంసా బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల రిబ్బన్ తో నిరసన చేశారునిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ భైంసా లో బీజేపీ నాయకులు ఆందోళన..చేశారు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలనీ డిమాండ్ చేశారు నిరసన కార్యక్రమంలో కౌన్సిలర్ సువర్ణ పోశెట్టి నందు భయ్యా నాగనాథ్ వేణు బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు