రామచంద్రి పార్థివ దేహానికి నివాళులర్పించిన ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల.చిన్నా రెడ్డి

వనపర్తి సెప్టెంబర్14( జనం సాక్షి)శ్రీరంగాపూర్ మండలం నాగరాల గ్రామానికి చెందిన రామచంద్రి గత కొంతకాలంగా ఆనా రోగ్యం బాగాలేక బుధవారం నాడు మృతి చెందారు . విషయం తెలుసుకున్నఏఐసీసీ కార్యదర్శి & మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.రాజేంద్రప్రసాద్ యాదవ్ స్వగ్రామానికి వెళ్లి రామచంద్రి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రామచంద్రి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు దాన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి చిన్నారెడ్డి గారు వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్ గారు NSUI జిల్లా అధ్యక్షులు రోహిత్ శ్రీరంగాపురం మండల అధ్యక్షులు రాములు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమ్మరి గోవిందు శ్రీరంగాపూర్ మండలం ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చందు శ్రీరంగాపూర్ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీను ఆనంద్ నాగరోల్ల గ్రామం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

తాజావార్తలు