చిరుధాన్యాల వంటలపై అవగాహన

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 14 (జనం సాక్షి)ఐసిడియస్ వరంగల్ ప్రాజెక్టు ఉర్సు సెక్టార్ 42 వ డివిజ డివి జన్ క రంగసాయిపేట అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ బత్తిని రమాదేవి అధ్యక్షతన పోషణమాసం కార్యక్రమము నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బత్తిని రమాదేవి మాట్లాడుతూ రోజు తీసుకునే ఆహారంలో బియ్యం కంటేచిరుధాన్యాలైనా కొర్రలు, రాగులు, సజ్జలు, సామలు మొదలగునవి తీసుకోవడం వల్ల షుగరు, బిపి లాంటి మొదలగు దీర్ఘవ్యాధికా రోగాలు రాకుండా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు కీలకం కాబట్టి వీరికి అంగన్వాడి కేంద్రంలో ఆటపాటల విద్య 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు నేర్పబడును ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటపాటల విద్యను ప్రోత్సహించాలి. అమ్మమ్మ నాయనమ్మలు ( వయోవృద్ధుల)తో వారు తీసుకున్న ఆహారపు అలవాట్లు ఎలా తయారు చేసుకోవాలో తల్లులకు చేసి చూపించడం జరిగింది.తల్లులకు పోషణ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా గర్భిణీ ఆహ్వానం (శ్రీమంతాలు) చేసి, ర్యాలీ నిర్వహించి పోషణ మాసము ప్రతిజ్ఞ చేయించటం జరిగింది. అనంతరము గర్భిణీ స్త్రీలు, ప్రీ స్కూల్ పిల్లల, ఆరు నెలల లోపు పిల్లలకు గృహ సందర్శనలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అంగన్వాడి టీచర్ యశోద ,ఆశా శ్రీదేవి,అంగన్వాడి కమిటీ సభ్యులు చందన, శ్రీదేవి, అమీనా, మానస ,పరహా , తల్లు లు, పిల్లలు పాల్గొన్నారు.

తాజావార్తలు