తుక్కుగుడలో జరిగే విజయ భేరి సభను విజయవంతం చేయాలి

-ఏఐసిసి కార్యదర్శి నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ అబ్జర్వర్ పి.వి.మోహన్.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 14 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి,జెడ్పి చైర్ పర్సన్ సరిత అధ్యక్షతన ఈనెల 17న ఆదివారం తుక్కుగుడ, హైదరాబాద్ నందు జరిగే విజయ భేరి సభకు సోనియా గాంధీ వస్తున్న సందర్భంగా నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ అబ్జర్వర్ ఏఐసిసి కార్యదర్శి పివి.మోహన్ ముఖ్య అతిధిగా హాజరై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించి, సోనియా గాంధీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రతినిధి గంజిపేట్ శంకర్,బల్గేర నారాయణ రెడ్డి,వీరు బాబు,ఇషాక్,వెంకటస్వామి గౌడ్,సత్యరెడ్డి, నల్లారెడ్డి, అమరావాయి కృష్ణారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అలెగ్జాండర్, గౌస్,గట్టు కృష్ణ, దినేష్, మజీద్,కీఫయిత్, శివరాజ్,ఆనంద్ గౌడ్, రాఘవేంద్ర రెడ్డి, భాస్కర్ రెడ్డి, జహంగీర్, జమాల్,రాము, ఎల్కూర్ నరిసింహులు, తిమ్మప్ప, మాచర్ల లక్ష్మణ్, విజయ్, ఆయా మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు