ఒక కుటుంబం ఓటర్లు ఒకే పోలింగ్ బూతులో ఉండే విధంగా మార్పులు చేయాలి.
భారతీయ జనతా పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్.
తాండూరు సెప్టెంబర్ 14 (జనం సాక్షి)
తాండూరు పట్టణంలోని పలు వార్డులలో ఒక ఇంటిలో నివసిస్తున్న ఒక కుటుంబానికి చెందిన సభ్యుల ఓటర్లు వేరే వేరే పోలింగ్ బూత్లలో కేటాయించడం ద్వారా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఈ విషయాన్ని వెంటనే సరిదిద్దాలని భారతీయ జనతా పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు..రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల సవరణ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి సర్వే చేసి ఒక కుటుంబం ఓటర్లు ఒకే పోలింగ్ బూతులో ఉండే విధంగా మార్పులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై అఖిలపక్ష సమావేశాల్లో పలుమార్లు తెలియజేసినప్పటికీ నేటికీ తాండూరు పట్టణంలో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఓటర్లు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గందరగోళంగా పోలింగ్ బూత్ల కేటాయింపు వల్ల ఓటింగ్ శాతం తగ్గిపోయి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా తాండూర్ ప్రాంతంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతంగా ఉన్నందున ఈ ప్రాంతంలో కర్ణాటకలో ప్రాంత వాసుల ఓట్లు చాలా ఉన్నాయని వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తాండూర్ కు సంబంధించిన ఎన్నికలు నిర్వహించే రిటర్నింగ్ అధికారులు ఈ విషయాలన్నీ పరిగణలకు తీసుకొని తాండూరు పట్టణ ప్రజల సమస్యను పరిష్కరించే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు