పంట తెగుళ్ల నుండి కాపాడేందుకు చర్యలు చేపట్టాలి-జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 14 రైతులు సాగు చేసిన పంటలకు తెగుళ్ల నుండి కాపాడేందుకు ప్రస్తుత తరుణం లో సస్య రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ అన్నారు. టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామంలో గురువారం వరి, పత్తి పంటలను పరిశీలించి రైతులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చారు, వ్యవసాయ అధికారుల సూచన మేరకే మందులు పిచికారీ చేయాలన్నారు. వారి వెంట వ్యవసాయ విస్తరణ అధికారి ఇంద్రయ్య పాల్గొన్నారు.

తాజావార్తలు