కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్


సెప్టెంబర్ 14 దేవరకొండ జనం సాక్షి న్యూస్ :
కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని దేవరకొండ శాసనసభ్యులు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిండి మండలానికి చెందిన 60మందికి రూ.60లక్షలు కళ్యాణ లక్ష్మీ చెక్కులను,చీరలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వార అత్యధికంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలు ఎక్కువ లబ్దిపొందడం జరుగుతుంది అని ఆయన అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాల పితామహుడని ఆయన కొనియాడారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు

తాజావార్తలు