ఆల్ ఫోర్స్ పాఠశాలలో విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం ఎల్లో డే కార్యక్రమం
భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 14
నిర్మల్ జిల్లా,భైంసా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో గురువారంరోజు విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హరితహారం మరియు ఎల్లో డే కార్యక్రమాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలను పెంచుకోవడం ద్వారానే పర్యావరణ సమతుల్యత సాధించవచ్చు అని అన్నారు మరియు ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలని మీరు నాటిన మొక్కలు భావితరాలకు కానుకలు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.