కళాకారులకు సన్మానం
జనంసాక్షి, రామగిరి : పెద్దపెల్లి జిల్లా యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో పెద్దపల్లి జిల్లాలోని కళాకారులను గురువారం ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన గాయకులు ఓడితల శ్రీనివాస్, బర్ల సత్తయ్య ని యూనియన్ పెద్దలకు అందరూ కలిసి సన్మానించడం జరిగింది వీరికి కమాన్పూర్ మాజీ జెడ్పిటిసి , కల్వచర్ల గ్రామ సర్పంచ్ గంట పద్మా వెంకటరమణ రెడ్డి అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని మన కలవచర్ల గ్రామానికి గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు. అలాగే ప్రాచీన కళలకు నటన మీద ఆసక్తి ఉన్న వాళ్లకు కళాకారులకు మా యొక్క సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ రవి, రేండ్ల కుమారస్వామి, బోనాల రాజయ్య, సతీష్, బొంకూరి పోశం, సింగిడి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ఇంచార్జ్ మేకల మారుతి పాల్గొన్నారు.