బీసీ కుల వృత్తుల చెక్కుల ను అందచేసిన ఎమ్మెల్యే
గద్వాల నడిగడ్డ,సెప్టెంబర్ 14 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల మండలం పరిధిలోని కొండపల్లి గ్రామానికి సంబంధించిన మొదటి విడత లోని బిసి కుల వృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చెక్కును ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా గురువారం లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపి లు విజయ్, రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, గద్వాల మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపిరెడ్డి, ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, మండలం సర్పంచులు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దివాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి , సోమేశ్వర్ రెడ్డి, గట్టు మండలం పార్టీ యూత్ అధ్యక్షుడు సంతోష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.