నేడే దేవరకొండ మక్కా మస్జిద్ మరియు ఈద్గా కాంప్లెక్స్ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నికలు

దేవరకొండ సెప్టెంబర్ 14 జనం సాక్షి న్యూస్ :నేడు దేవరకొండ పట్టణంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే మక్కా మస్జిద్ మరియు ఈద్గా కాంప్లెక్స్ కమిటీ అధ్యక్ష పదవి ఎన్నికలు జరగనున్నాయి. ఇట్టి అధ్యక్ష పదవి ఎన్నికల్లో నలుగురు బలమైన అభ్యర్థులు ఉండడంతో ఇట్టి ఎన్నికలు రసవత్తంగా మారాయి. బరిలో ఉన్న అభ్యర్థులందరూ అధ్యక్ష పదవి గెలుపు కోసం గత వారం రోజుల నుండి దేవరకొండ పట్టణంలో ప్రచారంలో ముమ్మరమయ్యారు. ఈ అధ్యక్ష పదవి కోసం క్రితం లో ఎన్నడూ లేని విధంగా పోటాపోటీ హోరాహోరీగా సాగుతుంది. ఇట్టి ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ బాసిద్, మొహమ్మద్ ముఫ్తి జావేద్ హుస్సేన్ ఖాస్మి, మహమ్మద్ ముఫ్తి రిజ్వాన్ తో పాటు మరో నలుగురు నిర్వహణ కమిటీగా ఉన్నారు.
ఈ ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన వారు వెయ్యికి పైచిలుగా ఉన్నారని ఓటర్లు అందరూ తమ ఓట్లను దేవరకొండ పట్టణంలో ఉన్న 12 మసీదులలో ఓటు వేసే ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఇట్టి ఓటింగ్ శుక్రవారం రోజు మధ్యాహ్నం గంటల 2.30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు ముగియనుంది. సకాలంలో వచ్చి తమ ఓటు వినియోగించుకోగలరని , అదే రోజు తదనంతరం ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల కమిటీ పేర్కొంది.

తాజావార్తలు