పోచమ్మ గుడికి రూ. 10,000 విరాళం అందజేసిన జడ్పీ చైర్మన్

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్ధిపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని శాలపల్లె లో శ్రీ పోచమ్మ గుడి, ఉత్సవాలకు రూ. 10 వేలు పెద్దపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ విరాళంగా పంపివ్వగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆలయ కమిటి సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపల్లె సర్పంచ్ తాటికొండ శంకర్, కమాన్ పూర్ ఏ.ఎం.సి వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, కమాన్ పూర్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడప కృష్ణమూర్తి, సిద్ధిపల్లె ఉప సర్పంచ్ జాబు సతీశ్, మాజీ సింగిల్ విడో చైర్మన్ బాద్రపు మల్లేష్, నాయకులు జంగపల్లి చిన్న శ్రీనివాస్, తాటికొండ రంజిత్, హరీశ్, సందీప్, నందయ్య, లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు