ముదిరాజ్ మత్స్యకారులను బిసి-ఏ లో చేర్చాలి
-మత్స్య సంపదను పెంచాలి-నూతన రక్షణ చట్టం రూపొందించాలి…
-1000 కోట్లతో ముదిరాజ్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి….
-పండుగ సాయన్న,కానిస్టేబుల్ కిష్టయ్య ల జీవిత చరిత్రలను పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలి…
-మత్స్య సొసైటీ జిల్లా నాయకులు జి.హరికృష్ణ ముదిరాజ్…
నాగర్ కర్నూల్ ఆర్సీ సెప్టెంబర్14(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ మత్స్యకారులను బీసీ-ఏ లో తక్షణమే చేర్చాలని మత్స్య సంపదను పెంచాలని నూతన రక్షణ చట్టాన్ని రూపొందించాలని 1000కోట్ల రూపాయలతో ముదిరాజ్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన తొలి అమరవీరుడు”కానిస్టేబుల్ కిష్టయ్య”పాలమూరు మట్టి పరిమళం నిజాం పాలనలో విరోచిత సాహస వీరుడు రాబిడ్ హుడ్”పండుగ సాయన్న”జీవిత చరిత్రలను పాఠ్యప్రణాళికలో పొందుపరచాలని ప్రభుత్వానీకి విన్నపం చేశారు.ఈ సందర్భంగా గురువారం తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కమిటీని సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మత్స్య సొసైటీ జిల్లా నాయకులు హరికృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన మత్స్య సంపదను అదనంగా పెంచాలని నూతన రక్షణ చట్టాన్ని రూపొందించాలన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 60లక్షల జనాభా ఉన్న ముదిరాజులు సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన అసంఘటిత కార్మికులైన మత్స్యకారుల సంక్షేమ నిధి 1000కోట్లతో ముదిరాజ్ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధంగా రాబిట్ హుడ్ పండుగ సాయన్న విరచిత సాహసా చరిత్రను తెలంగాణ రాష్ట్ర తొలి అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య జీవిత చరిత్రలను పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలని డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ జనాభా తమాషా ప్రకారం స్థానిక ఎన్నికలలో అవకాశం ఇవ్వాలి.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల రక్షణ చట్టాలను రూపొందించాలి.జాతి ఆర్థికంగా,విద్యా పరంగా,రాజకీయంగా,ముందుకు సాగేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి.కావున రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ కుల పెద్దలు,మేధావులు,విద్యావంతులు,జర్నలిస్టులు,లాయర్లు,కళాకారులు,పార్టీలకు,పదవులకు,అతీతంగా మరో ఉద్యమానికి నడుం బిగించాలి.భవిష్యత్తు అభివృద్ధి కోసం పాటుపడాలి.అందుకుగాను తక్షణమే మనమందరం సమిష్టిగా ఏకమవుదాం ముదిరాజ్ సత్తా చాటుదాం అన్నారు.ఇకనైనా మనం మేలుకోకపోతే ఏ కులం అయితే చట్టసభల్లో ఉండదొ ఆ కులం అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది.కనుక ఒకసారి ఆలోచించండి ముదిరాజు జాతిలో ఉన్న మేధావులారా అని అన్నారు.అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన మత్స్య సొసైటీ అధ్యక్ష కార్యదర్శులకు మరియు డైరెక్టర్లకు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ,శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గజ్జలయ్య,ఉపాధ్యక్షులు ఆంజనేయులు,కార్యదర్శి శంకరయ్య,డైరెక్టర్లు శ్రీనివాసులు,రాములు యాదయ్య,సందీప్,లింగయ్య,శివ,కమిటీ సభ్యులు తిరుపతయ్య,జంగయ్య,నిరంజన్,లక్ష్మయ్య,తదితరులు పాల్గొన్నారు.