కిషన్ రెడ్డి ని అరెస్టు చేయడం ఆప్రజాస్వామికం.
మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్ 14
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు ఉపవాస దీక్ష చేస్తున్న కేంద్ర మంత్రి,రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ని ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేయడం ఆప్రజా స్వామి కమని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్అన్నారు.ఈసందర్భంగా
ఆయన మాట్లాడుతూ.40 లక్షల మంది యువత జీవితాలను కేసీఆర్ నాశం చేశారని ఆరోపించారు.తల్లిదండ్రులు బంగారం అమ్మి,అప్పులు చేసి మరీ నగరంలో కోచింగ్ తీసుకొని,వీధిలైట్ల కింద,పార్కుల్లో చదువుకొని పరీక్షలు రాస్తే ప్రశ్నాపత్రాలు లీకై నిరుద్యోగ యువత బతుకులు ఆగమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు పోరాటం చేస్తే కేసులు పెట్టారని అన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన హెచ్చరించారు.

తాజావార్తలు