కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అధైర్య పడొద్దు
* జడ్పీ చైర్మన్ కోరం, సొసైటీ చైర్మన్ లక్కినేని సంఘీభావం
* నాలుగవ రోజుకు చేరిన అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె

టేకులపల్లి,సెప్టెంబర్ 14( జనం సాక్షి): రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారానికి నాలుగు రోజులకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలో టేకులపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, బేతంపూడి సొసైటీ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావులు సమ్మె నిర్వహిస్తున్న శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయపరమైన వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించి ఆ తర్వాత పతనమయ్యారని, ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో అవలంబిస్తే అదే పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడి ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటాయని, మీ సమస్యల పోరాటంలో భాగస్వామ్యం అవుతామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారందరికీ భోజన ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.
సిఐటియు, ఏఐటీయూసీ సంఘీభావం: సిఐటియు, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సిఐటియు, ఏఐటీయూసీ కార్మ

తాజావార్తలు