రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడ్డ 22 వేల కోట్లు చెల్లించాలి
-సీఐఎల్ అగ్రిమెంట్లను అమలు చేయాలి
-రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు
యైటింక్లయిన్ కాలని, సెప్టెంబరు 14 (జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బకాయి పడ్డ 22 వేల కోట్లు చెల్లించాలని, సీఐఎల్ అగ్రిమెంట్లను వెంటనే అమలు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు యాజమాన్యాని కోరారు.
గురువారం ఓసీపీ-3 కృషి భవన్లో, బేస్ వర్క్ షాప్ క్యాంటీన్ లో వారు పాల్గొని మాట్లాడారు. కోల్ ఇండియాలో ఆగస్టు నెల వేతనాలతో 11వ వేతన ఏరియర్స్ చెల్లించమని సర్కులర్ ఇచ్చిన సింగరేణి యాజమాన్యం ఈనెల 21న చెల్లించుటకు సర్కులర్ జారీ చేయడం మరోవైపు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన 22 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా సంస్థకు రావలసిన బకాయిలను ప్రభుత్వం ఎన్నికల కోడ్ రాకముందే ఇవ్వాలని అన్నారు, కొత్తగా విధుల్లో చేరుతున్న బదిలీ వర్కర్ కార్మికులకి 190/240 నిండిన వెంటనే పర్మినెంట్ చేయటంలో ఆలస్యం వల్ల వారు పలు ప్రమోషన్లకు సీనియార్టీ కోల్పోతున్నారన్నారు. వెంటనే బదిలీ వర్కర్ లందరికీ జనరల్ మజ్దూరు ఇవ్వాలని, వారికి చెల్లించే బేసిక్ ప్రొటెక్షన్ పై ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కంపెనీ అవసరాల నిమిత్తం సర్ఫేస్ కు పెట్టుకోమని నోటీసు బోర్డులు వేస్తూ కార్మికుల బేసిక్ తగ్గించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కార్మికుల వేతనాలను సర్ఫేస్కు వచ్చినప్పుడు తగ్గించడానికి అన్ని సంఘాలు ఏకమై యాజమాన్యంపై పోరాటం చేసి బేసిక్ ప్రొటెక్షన్ కల్పించేలా ముందుకు రావాలన్నారు. సింగరేణి నిధులను ఇతర ప్రాంతాల్లో అభివృద్ధికి మళ్లించుకునే ప్రజాప్రతినిధులు, సైకిల్ జంక్షన్ నుండి ఓసీపీ-3 కృషి భవన్ వరకు రోడ్లు వెడల్పు చేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేయాలని, రోడ్లు మరమ్మత్తులు చేయాలని సిఐటియుగా గత సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్న పట్టించుకోవడంలేదని, కనీసం గుర్తింపు సంఘంగా ఇంకా కొనసాగే నాయకులైన యాజమాన్యంతో మాట్లాడి ఎందుకు చేయించడం లేదని, వారి పైరవీలు మాత్రం యధావిధిగా చేసుకుంటున్నారని విమర్శించారు. సిపిఆర్ఎంఎస్ ట్రస్ట్ బోర్డులో కోల్ ఇండియాలో అన్ని సంఘాలకు ప్రాతినిధ్య కల్పిస్తుండగా సింగరేణిలో మాత్రం కేవలం గుర్తింపు సంఘానికి అవకాశం కల్పించడం వల్ల అక్కడి ఒప్పందాలు ఇక్కడ అమలు చేయడం లేదని, అవగాహన రాహిత్యంతో కంపెనీ ఆసుపత్రులలో ఇన్ పేషెంట్ గా చేరితే కూడా కార్డు నుండి డబ్బులు రికవరీ చేసేలా ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ఒప్పందాలపై అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అర్జీ- 2 కార్యదర్శి ఉల్లి మొగిలి, ఎస్. వెంకన్న, వి. రాజేశం, ఎస్. రాజన్న, ఎస్. వెంకటేశ్వర్లు, ఎన్. సాంబరాజు, జి. సురేష్, ఆంజనేయులు, ఎ. భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు