ఆర్జీ- 2 లో గనుల ఉత్పత్తి లక్ష్యాల టార్గెట్ కమిటీ పర్యటన
యైటింక్లయిన్ కాలని సెప్టెంబరు 14 (జనంసాక్షి):
రాబోయే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు సింగరేణిలోని వివిధ గనులు సాదించవలసిన బొగ్గు ఉత్పత్తి, ఓబి తొలగింపు లక్ష్యాలను కార్పొరేట్ టార్గెట్ కమిటీ నిర్ణయిస్తుంది.
గురువారం ఆర్జీ-2 ఏరియా కన్ఫెరెన్స్ హాల్ నందు ఏరియా జనరల్ మేనేజర్ ఎల్.వి.సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశములో జిఎం సి.పిఅండ్ పి కార్పొరేట్ కమిటీ కన్వీనర్ జక్కం రమేష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు జిఎం ఓసిపిలు డివిఎస్ సూర్యనారాయణ రాజు, జిఎం సర్వే రవి , ఏజీఎం ఐఇడీ బి.రవి, ఏజీఎం ఇఅండ్ ఏం మాచారయ్య, మేనేజర్ వినోద్ కుమార్, అడిషనల్ మేనేజర్ దిలీప్ కుమార్, ఏరియా ముఖ్య అధికారులతో ఓసిపి3, వకిల్ పల్లి గని ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణయించేందుకు సమీక్ష సమావేశం నిర్వహించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను, బొగ్గు నాణ్యతను ఉత్పత్తి సాదించేందుకు అవసరమయ్యే యంత్రాలు, పని స్థలాలు, పరికరాలు, కావలసిన స్పేర్ పార్ట్స్ ల గురించి కూడా కమిటీ సభ్యులు క్షుణ్ణంగా చర్చించారు. అదే విదంగా బొగ్గు ఉత్పత్తికి అవసరమైన భూసేకరణ , దాని కోసం ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం మొదలగు అంశాల పై చర్చించినారు. కమిటి కన్వనీర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే వచ్చే ఏడాది కూడా ఆర్జీ-2 ఏరియాకు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోరారు.
ఈ సమావేశములో వకీల్ పల్లి ప్రాజెక్ట్ అధికారి కాంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఓసిపి-3 ప్రాజెక్ట్ అధికారి మదుసుధన్, ఎస్ఓటుజిఎం అబ్దుల్ సలీం, ఏరియా ఇంజినీర్ నరసింహరావు, ప్రాజెక్ట్ ఇంజినీర్ రాజాజీ, డిజిఎం (సివిల్) ధనుంజయ, డీజిఏం (ఐఇడీ) మురళీకృష్ణ, డిజిఎం (వర్క్ షాప్) ఎర్రన్న, డిజిఏం (స్టోర్స్) సృజన్ మెహ్రా, ఏరియా సర్వే అధికారి బుక్య దేశాయి, ఓసిపి3 సర్వే అధికారులు నర్సింగారావ్, దీటి చంద్రమౌళి, సిహెచ్ పి ఇంచార్జ్ సదానందం, మేనేజర్లు డి.రమేష్, పీ. రవి కిరణ్, డిప్యూటీ మేనేజర్ క్వాలిటీ వెంకట మోహన్, డిప్యూటీ ఎఫ్ఏం తిరుపతి రెడ్డి, వకీల్ పల్లి, ఓసిపి- 3 అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

తాజావార్తలు