కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం లాంటిదజడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్ మోమిన్ పేట

సెప్టెంబర్ 14 జనం సాక్షి
కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం లాంటిది అని వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్ పేర్కొన్నారు.గురువారం మో మీన్ పేట మండలానికి చెందిన 48 మందికి కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కులను, లబ్ధిదారులకు జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వార అత్యధికంగా వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట మండల ప్రజలు ఎక్కువ లబ్దిపొందడం జరుగుతుంది అని ఆయన అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంక్షేమ పథకాల పితామహుడని ఆయన కొనియాడారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసంత వెంకట్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి తహసిల్దార్ మనోహర్ చక్రవర్తి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు హరిశంకర్ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి కాశీరామ్ నాయక్ అంజయ్య యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు డి వెంకట్ సీనియర్ నాయకుడు ఎం మధుసూదన్ రెడ్డి మైపాల్ సందీప్ మంగలి రాజు వివిధ గ్రామాల ఎంపిటిసి సభ్యులు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు