జీడి శ్రీనివాస్ ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటు.
మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్ 14
జీడి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మిక మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ అన్నారు.సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ జీడి శ్రీనివాస్ గౌడ్ సంతాప సభ గురువారం మల్కాజిగిరి లోని గాంధీ పార్క్ లో జరిగింది.ఈ సంతాప సభలో నంది కంటి శ్రీధర్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు,
స్నేహితులు,కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై శ్రీనివాస్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తూ,ఆయనతో కలిసి తిరిగిన జ్ఞాపకాలను గుర్తుచేసుకొని కంటతడి పెట్టారు.ఈ సందర్భంగా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ.జీడి శ్రీనివాస్ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయ మని ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ కుమార్,మండల రాధాకృష్ణ యాదవ్,వెంకటేష్ యాదవ్, వాసవోని శ్రీనివాస్ గౌడ్,పిట్టల శ్రీనివాస్, ఉమేష్ సింగ్,గుత్తి రామచందర్,వినోద్ యాదవ్,సానాది శంకర్,మహమ్మద్ అలీ,వంశీ ముదిరాజ్,ఎంఆర్ శ్రీనివాస్ యాదవ్,చాకో,రెబ్బ వాసు,రాములు, విటల్,రాజేష్ గౌడ్,సూర్య ప్రకాష్, ప్రవీణ్,బికే శ్రీనివాస్,మహేందర్ గౌడ్, నరేందర్ గౌడ్,శ్యామ్,గౌస్,నాగేష్ గౌడ్, డోలి రమేష్,సూర్యప్రకాష్ రెడ్డి,పవన్, శ్రీనివాస్,యాదగిరి,ఆశ,రోజా రమణి, వీనస్ మేరీ,నవనీత,మాధవి,నిర్మల, భాగ్యమ్మ,యశోద తదితరులు పాల్గొన్నారు.