బీసీ బందు అన్ని కులాలకు వర్తింపచేయాలి- కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు బండారి సదానందం డిమాండ్
జనంసాక్షి , రామగిరి : 14 బీసీ బంధు అన్ని కులాలకు వర్తింపచేయాలని రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు బండారి సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ..గతం లో కాంగ్రెస్ ప్రభుత్వం మంథని నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ప్రజలుకు సంక్షేమ పథకాలు అందజేశాయి అని అన్నారు. తెలంగాణప్రభుత్వం ఇటీవల బీసీకులాలకు లక్ష రూపాయలు ఆర్థికసహాయం అందిస్తూ ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని పద్మశాలీలు, ముదిరాజు, మున్నూరుకాపు, గౌడ కులస్తులకు తో సహా బీసీకులాల వారందరికీ వర్తింపజేయాలి అని కోరారు. బిసి బంద్ ఇస్తున్న కులాల్లో సైతం
బిఆర్ఎస్ నాయకులే బీసీ బందు కట్టబెడుతున్నారని వారు మాత్రమే అర్హుల అని ప్రశ్నించారు. బీసీ బందు..బిఆర్ఎస్ బంధు అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఉద్యమ చేశారు. బిఅర్ఎస్ ప్రభుత్వం మాత్రం బిఆర్ఎస్ నాయకులకు మాత్రమే పథకాలు అందజేస్తున్నారని మండిపడ్డారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు, బీసీ బందు అందజేయాలి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లద్నాపూర్ మాజీ సర్పంచ్ రొడ్డ బాబు, ఆదివారంపేట మాజీ ఉప సర్పంచ్ అట్టే తిరుపతి రెడ్డి, మెడగొని రాంచందర్, తాళ్లపల్లి చంద్రయ్య, బూరుగు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.