ఓటరు నమోదు పై విద్యార్థులకు అవగాహన
జనంసాక్షి, మంథని : స్వీట్ ఆక్టివిటీ లో భాగంగా గురువారం పెద్దపెల్లి జిల్లా మంథని లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఓటర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడ జరిగింది. ఈ కార్యక్రమంలో మంథని తాసిల్దార్ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యత, ఓటరు నమోదు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ ప్రిన్సిపాల్ లక్ష్మి, గిర్డావార్ రాజిరెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.