అంతర్ జిల్లా దేవస్థానాల దొంగల ముఠా అరెస్టు: జిల్లా డిఎస్పి..

ధర్మపురి( జనం సాక్షి) గత కొన్ని రోజుల నుంచి జగిత్యాల జిల్లాతో పాటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో గల దేవస్థానంలో నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నారు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో వారిపై 21 కేసులు నమోదు అయినవని డిఎస్పి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో వివిధ మండలాలలోని గ్రామాల్లో పోచమ్మ గుడి, గొల్లపల్లి హనుమాన్ గుడి, జగిత్యాల లోని వీరయ్య గుడి, ఎండపల్లి గుల్లకోట గ్రామంలో ఎల్లమ్మ గుడి, ధర్మపురి గ్రామంలో ఆంజనేయస్వామి గుడి పెద్దమ్మ గుడి శివాలయం రెండు ఇండ్లలో దొంగతనాలు శ్రీరామ భక్త ఆంజనేయ గుడి శివాలయం జగిత్యాలలో రెండు బైకులు దొంగతనాలు చోరీ చేసినట్లు తెలుపుతూ, మంచిర్యాల జిల్లాలో లక్ష్మీదేవి గుడి, సత్యనారాయణ స్వామి గుడి, శిరిడి సాయిబాబా గుడి, వీటితోపాటు పెద్దపెల్లి జిల్లాలో శివాలయం, పెద్దమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, హనుమాన్ గుడి, నంది మేడారం గ్రామంలోని హనుమాన్ గుడి, ఇవన్నీ కూడా నేరం చేసినట్లు ఒప్పుకున్నారని, డిఎస్పీ ఎన్. వెంకటస్వామి మీడియాకు తెలుపుతూ వీరిని పట్టుకోవడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన ధర్మపురి సిఐ రమణమూర్తి సిసిఎస్ సిఐ జి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో దొంగల ముఠాను పట్టుకున్న ధర్మపురి ఎస్సై దత్తాత్రి, జె. రామకృష్ణ, గొల్లపల్లి ఎస్సై ఏ. నరేష్ కుమార్, బుగ్గారం ఎస్సై పి. సందీప్, వెలగటూర్ ఎస్సై కె. శ్వేత, కానిస్టేబుల్ లు రమేష్ నాయక్, ఎండి హలీమ్, కిరణ్, తిరుపతి నాయక్, ఆదిల్, ముస్తఫా, వీరిని జిల్లా ఎస్పీ అభినందించారు.

తాజావార్తలు