గణేష్ నిమజ్జనం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 14 (జనం సాక్షి);జిల్లాలో గణేష్ నిమజ్జనం ,తెలంగాణా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలనీ జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా అధికారులకు ఆదేశించారు.
గురువారం నూతన సమీకృత కార్యాలయ సమావేశం హాలు నందు జిల్లా ఎస్పి, జిల్లా అదనపు కలెక్టర్ లు చీర్ల శ్రీనివాస్, అపుర్వ్ చౌహాన్ ల తో కలిసి గణేష్ నిమజ్జనం , జాతీయ సమైక్యత దినోత్సవ ఏర్పాట్లు పై సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకునేలా అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.నిమజ్జనం చేసే ప్రాంతాలలో బ్యారికెడింగ్, లైటింగ్, క్రేన్ లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.విగ్రహాల తరలింపు మార్గాలలో పైన వైర్లు,చెట్లు అడ్డు రాకుండా తొలగించాలని,వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.నిమజ్జనం వద్ద త్రాగునీటితో పాటు,పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారికి సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నిమజ్జనం వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సంబందిత అధికారికి సూచించారు.కార్యక్రమం సజావుగా నిర్వహించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిమజ్జనం వద్ద ఫైర్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు చేయాలనీ సూచించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో సమన్వయ సమావేశాలు నిర్వహించుకుని రెవెన్యూ ,పోలీస్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ శాఖలు సమన్వయంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లా ఎస్పీ సృజన మాట్లాడుతూ,మండపాల వద్ద, నిమజ్జనం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు లేవని తెలుపుతూ,ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎక్కువ మంది పోలీస్ బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.నవ రాత్రులలో భాగంగా శబ్ద కాలుష్యం లేకుండా చూడాలన్నారు.నిమజ్జనం వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా,మతపరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపదుతున్నామని అన్నారు.
ఈనెల 17 న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం ను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఇందులో భాగంగా ఐ డి ఓ సి కార్యాలయంలో ఉదయం 9:00 గంటలకు జాతీయ జెండాను ముఖ్య అతిథి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొనాలని సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని,త్రాగునీరు, పారిశుద్ధ్యంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారమ సీటింగ్ ఏర్పాట్లు చేయాలనీ టి , స్నాక్స్ ఏర్పాట్లు చేయాలనీ సంబంధిత అధికారులకు ఆదేశించారు.సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ లు చీర్ల శ్రీనివాస్, అపుర్వ్ చౌహాన్ , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు