అధికారుల అభ్యంతరం ఎందుకు?

( ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి )
బొగ్గు గనుల యూనియన్ నేతలు అధికారుల సంఘం నేతల మీద గుస్సా తో ఉన్నారు.
గురువారం 14.09.2023నబొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని కార్మిక సంఘాల బిఎమ్మెస్ ,ఏఐటీయూసీ, హెచ్ ఎం ఎస్, సీఐటీయూ , ఐఎన్ టి యు సి,అల్ ఇండియా ప్రతినిధుల అత్యవసర సమావేశం రాంచీలోని సి.సి.ఎల్. దర్భంగా హౌస్‌లో జరిగింది. ఈ సమావేశం లో బిఎంఎస్ బొగ్గు పరిశ్రమ ఇంచార్జి కొత్త కాపు లక్ష్మారెడ్డి , ఎబికెఎమ్మెస్ వైస్ ప్రెసిడెంట్ మజ్రుల్ హక్ అన్సారీ పాల్గొన్నారు బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల 11వ వేతన ఒప్పందానికి వ్యతిరేకంగా కోల్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు తీసుకున్న చర్యల వల్ల బొగ్గు పరిశ్రమలో తలెత్తిన పరిస్థితులపై సమావేశంలో చర్చించారు. ఈ చర్యను ఐదు కార్మిక సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు అఫీసర్స్ అసోసియేషన్ ఈ చర్యతో బొగ్గు పరిశ్రమలో కార్మికులు, అధికారుల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న సత్సంబంధాలు దెబ్బతిన్నాయి అని వారు తెలిపారు,పై విషయాలు పరిశీలన తర్వాత, భారత ప్రభుత్వం లేదా కోల్ ఇండియా మేనేజ్‌మెంట్ అధికారుల జీతాలు, సౌకర్యాలు మరియు అలవెన్సులను 10 సంవత్సరాలలోపు (2027 వ సంవత్సరం వరకు కాల పరిమితి) మూగయక ముందు పెంచినట్లయితే, అన్ని కార్మిక సంఘాలు దానిని వ్యతిరేకిస్తాయని నిర్ణయించారు.
ఇదిలావుండగా యాజమాన్యం గనుక మళ్ళీ పే రివ్యూ అధికారులకు వర్తింపజేస్తే.. దాని ప్రకారం బొగ్గుగని కార్మికులకు వర్తింపజేయాలి.
అంతే కాకుండా ఇక నుంచి అధికారులతో బొగ్గు పరిశ్రమకు సంబంధించిన ఏ వేదికలోనూ కార్మిక సంఘాల ప్రతినిధులెవరూ పాల్గొనకూడదని నిర్ణయించారు.
ఇక బొగ్గు రంగ పరిశ్రమలో కోల్ ఇండియా,సింగరేణి లో 2023 అక్టోబర్ 5-6-7 తేదీల్లో బొగ్గు పరిశ్రమలో 3రోజుల సమ్మె చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని యూనియన్లు సంయుక్తంగా సమ్మెకు సన్నాహాలు ప్రారంభించాలని అన్ని ఫెడరేషన్లు బొగ్గు కార్మికులకు పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించి, 21/22 సెప్టెంబర్ 2023న మైన్, డిపార్ట్మెంట్ స్థాయిలో మరియు అక్టోబర్ 3న ఏరియా స్థాయిలో ఉమ్మడి ధర్నా ప్రదర్శనలు నిర్వహించండి. అని తెలియచేసారు. అని ఏబి కెఏంఎస్ కార్యదర్శి మాధవ నాయక్, బి ఎం ఎస్ సింగరేణి అధ్యక్షులు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి టీ. ఎస్ పవన్ కుమార్, ఒక సంయుక్త ప్రకటన లోయాదగిరి సత్తయ్య అధ్యక్షులు, పేరం రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ.ఎస్. పవన్ కుమార్ ప్రధాన కార్యదర్శి

తాజావార్తలు