కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం —
బిఆరెఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగ యువత కోసం ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు మరియు నిరుద్యోగ భృతి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేస్తున్న శాంతియుత ఒకరోజు దీక్షని పోలీసులచే బగ్నం చేపించినందుకు నిరసనగా గురువారం మంచిర్యాల జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో బి జె వై ఎం ఆధ్వర్యంలో బిఆరెఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కెసిఆర్ దిష్టి బొమ్మని దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పాల్గొన్నారు