ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి
– బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ.
-గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 14 (జనం సాక్షి);
లైసెన్స్ లబ్ధిదారులకు ఎల్ఎల్ఆర్ అందజేసిన బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ.ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఉద్దేశంతో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ. ఉచిత డ్రైవింగ్ లైసెన్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అందులో భాగంగా గురువారము గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ధరూర్ మండలం బూరెడ్డి పల్లి గ్రామాల నుండి వచ్చిన వారికి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకున్న వారికి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణమ్మ చేతుల మీదుగా యల్ యల్ ఆర్ కాపిన అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం క్రిష్ణ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షుడు జమ్మిచెడు ఆనంద్,మల్దకల్ మండల అధ్యక్షుడు పాల్వాయి రాముడు,బిజెపి సీనియర్ నాయకులు దరూర్ కిష్టాన్న ,బూరెడ్డి పల్లి నరసింహ చారి, అరుణ్ తదితరులు ఉన్నారు.