పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను ప్రతిష్టాపించి పూజించాలి.

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 14 (జనం సాక్షి)
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను ప్రతిష్టాపీంచి పూజించాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ గంజ్ ఆవరణలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మట్టి వినాయకులను ప్రతిష్టాపించి పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణను కాపాడుకునేందుకు వీలుపడుతుందని తెలిపారు. ప్యారిస్సా ప్లాస్టర్ తో తయారు చేయబడిన వినాయకుల ద్వారా అనేక అనర్థాలు జరుగుతాయని వెల్లడించారు.
ప్యారిస్ ఆఫ్ ప్లాస్టర్తో తయారు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయడం ద్వారా నీటి కాలుష్యం ఏర్పడి జలచరాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మట్టిని వినాయకులను ప్రతిష్టాపించి పూజించాలని తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దిపనర్సింలు ,ఫౌండేషన్ ఫౌండర్ అధ్యక్షులు తులజారాంసింగ్,. అధ్యక్షులు కల్వ రాధా కృష్ణ,,మెంబర్లు కల్వ అశోక్. బంటారం సుధాకర్, సల్ల దామోదర్, కుంచం మురళి, మార్కెట్ డైరెక్టలు భాను, ప్రశాంత్,రవిశంకర్ పాటిల్, దీ గీన్ అండ్ సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.