అవినీతికి పాల్పడితే అదే చౌరస్తాలో ఉరి తీయండి*

నన్ను నమ్ముకుని నా వెంట ఉండే వారికోసం నా చివరి శ్వాస వరకు అండగా ఉంటా

కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు తూడి మేఘారెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 14 (జనం సాక్షి)

రేపు జరగబోయే ఎన్నికల్లో తనకు సహకరించి తనను ఆశీర్వదించాలని.. మీ _ఆశీర్వాదాలతో నేను అందలమెక్కి అవినీతికి పాల్పడినట్లు మీరు గుర్తిస్తే ఇదే చౌరస్తాలో ఉరి తీయాలని కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు
తూడి మేఘరెడ్డి అన్నారు

ఈనెల 17న తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగే కాంగ్రెస్ విజయభేరి సన్నాహక సభలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, మేఘ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు.

గురువారం ఉదయం వనపర్తి పట్టణంలోని చింతల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజ చేసి అక్కడి నుంచి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాదయాత్రగా బయలుదేరి గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ గాంధీ చౌక్, ఇందిరా గాంధీ చౌక్, భగీరథ చౌరస్తా మీదుగా లక్ష్మీ కృష్ణ కళ్యాణ మండపం వరకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర యువజన అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధిస్తుందని వనపర్తి నియోజకవర్గం లోను కాంగ్రెస్ పార్టీని విజయం సాధిస్తుందన్నారు
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించిన వ్యక్తికే ఎమ్మెల్యే సీటు వస్తుందని ఎవరికి సీటు వచ్చినా తామందరం కలిసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మేఘారెడ్డి మాట్లాడుతూ BRS అధికారంలోకి వచ్చాక తామే అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రం 33 జిల్లాలుగా ఏర్పడిందని ఈ 33 జిల్లాల్లోనూ అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అన్ని మంజూరు అవుతున్నాయని కేవలం వనపర్తి జిల్లాకు మాత్రమే మంజూరు కావడం లేదని అదేదో తామే అభివృద్ధి చేశామని చెప్పడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు….
రోడ్ల విస్తరణ చేశామని చెప్పుకునే అధికార పార్టీ నాయకులు 2018 నాటికే నాగర్కర్నూల్, కొత్తకోట లాంటి పట్టణాల్లో రోడ్ల విస్తరణ పూర్తయిందని పట్టణ అభివృద్ధిలో భాగంగా చేసిన పనులను సైతం తామేదో చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

రోడ్ల విస్తరణ లో భాగంగా రోడ్డు కటింగ్ వ్యవహారంలో ప్యాకేజీల వ్యవహారం నడిపి తమ జేబులు నింపుకున్నారే తప్ప నిరుపేద కుటుంబాలైన చిరు వ్యాపారులకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆయన విమర్శించారు.

గత 50ఏళ్ల క్రితమే వనపర్తి నియోజకవర్గం విద్యావంతంగా అభివృద్ధి చెందిందని ఆనాడే వనపర్తి లో పైసలు ముద్రించే యంత్రాలు, విద్యుత్ తయారి యంత్రాలు ఆర్టీసీ డిపో కూడా ఉండవని పేర్కొన్నారు.

నేను అభివృద్ధి చేశాను అంటూ తాత్కాలికానందం పొంది ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులు కూడా తమ పేరును పెట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు.
వనపర్తి రాజా రామేశ్వరరావు తనకున్న ఆస్తులను ప్రభుత్వ పరంగా చేసిన తన పేరు ఎక్కడ కూడా వాడుకోలేదని గుర్తు చేశారు.

ఉన్న నీళ్ల ట్యాంకులకు రంగులేసి మిషన్ భగీరథ పనులు చేశామని తెలంగాణ వచ్చిన తర్వాతే మీరందరూ నీళ్లు తాగుతున్నారన్నట్లుగా వ్యవహరించడం తెలంగాణ పార్టీ నాయకులకే చెల్లిందని ఎద్దేవా చేశారు.

కానాయపల్లిలోని శంకర సముద్రం వద్ద ఇన్నర్ కెనాల్, ఔటర్ కెనాల్ కు సంబంధించిన పనులు అప్పటికే పూర్తయ్యాయని రింగుబండ్ పనులు పూర్తయితే దాని నుంచి నీళ్లు సరఫరా అవుతాయన్న కోణంలో తాను రింగుబండ్ పనులు పూర్తి చేస్తే వాటి ద్వారా పానగల్ మండల వరకు నీళ్లు వెళ్ళాయని పనులు చేసిన తనకు మాత్రం ఎటువంటి బిల్లులు అందకపోగా తన పేరు మీద కూడా బిల్లులు చేసుకొని తిన్న ఘన చరిత్ర ఉన్న నాయకులు వనపర్తి లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల ముందు ఉన్న ఆస్తుల వివరాలు నేడు అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలు ఏ విధంగా పెరిగాయని ఆయన ప్రశ్నించారు..

అవినీతి కార్యకలాపాల్లో సహకరిస్త లేరన్న కలెక్టర్లకు అధికారులకు రాత్రికి రాత్రే ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యాయని వీటన్నింటికీ కారణం ఎవరు అన్నది అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు.

అవినీతి అక్రమాలకు పాల్పడుతూ భూకబ్జాలకు తెరలేపారని నాయకులతో పాటు తోక నాయకులు కూడా భూకబ్జాలకు పాల్పడ్డారని
ఈ క్రమంలో నిరుపేదలు నిరుపేదలు గానే మిగిలిపోయారని ఆయన అన్నారు.

వీరాయపల్లి గ్రామంలోని వేరుశనగ పరిశోధన కేంద్రం పనుల్లో తాను పనులు చేస్తే తన అనుచర ఘనం మీద నిధులు మంజూరు చేయించుకున్న ఘనత BRS నాయకులకి దక్కిందని ఆయన విమర్శించారు.

పాలమూరు రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్కు సందర్శనార్థం ప్రతినిత్యం ఎందరినో పంపుతున్న నాయకుడు ఆ పాలమూరు రంగారెడ్డి వల్ల వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల ఆయకట్టుకు ఎంత నీరు వస్తుందో అని చెప్పాలని డిమాండ్ చేశారు.

సందర్శకులను ఎదుల రిజర్వాయర్ కాకుండా తాను కబ్జా చేసిన స్థలాలకు పంపించి ఈ విధంగా చూపించాలని పేర్కొన్నారు.

ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఇకపై వచ్చేది మన కాలమేనని ఎవరు కూడా ఎక్కడ అధైర్య పడవద్దని మీ వెనకాల నేను ఉండి ఎక్కడి వరకైనా మీకోసం వస్తానని ఆయన నాయకులు కార్యకర్తలకు భరోసా కల్పించారు.

ప్రస్తుతం అధికార మదంతో ఉన్న BRS నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారని వారు అంతకుమించి మనను ఏమి చేయలేరని అందరూ కూడా ధైర్యంగా నిలబడి ఎదురు తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రానున్న కాలంలో ఈ అవినీతి పాలను దూరం చేయవచ్చునని ఆయన వారికి సూచించారు.

అధినాయకత్వన్నని తనను ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదని చెప్పుకునే నాయకుడు ఇసుక ట్రాక్టర్ల వద్ద కూడా కమిషన్లు వసూలు చేయడం విడ్డూరం అన్నారు.
BRS కండువా కప్పుకుంటేనే తమకు పనులు ఇస్తామని, తమ పనులు కొనసాగనిస్తామని ఎంతో మందిని ప్రలోవ పెడుతూ బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఎక్కడ ఎవరు కూడా లొంగాల్సిన అవసరం లేదని ఆరిపోయే ద్వీపానికి వెళుతురు ఎక్కువ అన్నట్లు ఓడిపోయే నాయకుడు ఇలాంటి దుచ్చెర్లకు పాల్పడుతూనే ఉంటారని ఎక్కడ కూడా ఎవరు ధైర్యం కోల్పోకూడదు అని ఆయన నాయకులకు కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం అమలయ్యాక నిరుద్యోగ యువతను తాగుడుకు బానిసకుచేసింది తప్ప ఉద్యోగ కల్పన ఎక్కడ కూడా చేయలేదన్నారు.

ఈ క్రమంలో 3వేల వైన్ షాపులు 60 వేల బెల్ట్ షాపులు కొనసాగిస్తూ నిరుద్యోగ యువత బతుకును బజారుపాలు చేస్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్న ఆయన విమర్శించారు.

డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ప్రజలను మభ్యపెడుతున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను చూపించాలని…
డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చిన గ్రామాలలో తాము ఓట్లు కూడా అడగమని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాలలో వారు కూడా ఓట్లు అడగరాదని ఆయన సవాల్ విసిరారు.

దళిత బంధు బీసీ బందు అంటూ ప్రొసీడింగులు జారీ చేసి ప్రజలను మభ్యపెట్టే నాయకులు వారికి నిధులు మంజూరు చేసి దళిత బంధు బీసీ బందు ఇచ్చామని చెప్పుకుంటే బాగుంటుందని ఇతర చేశారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల రూపాయలు, ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, ప్రతి ఇంటికి 500 కే సిలిండర్, ప్రతి మహిళ రాష్ట్రంలో ఎక్కడికైనా తిరిగి ఎందుకు బస్సులో ఉచిత ప్రయాణం, చదువుకునే విద్యార్థులకు స్కూటీల పంపిణీ. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లతోపాటు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధుల మంజూరు లాంటి ఎన్నో పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతుందని ప్రస్తుతం పింఛనందుకునే ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఎంత మంది ఉన్నా వారికి ఒక్కొక్కరికి 4000 పెన్షన్ మంజూరు చేసేదే కాంగ్రెస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు.

ఈనెల 17వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే కాంగ్రెస్ విజయభేరి కార్యక్రమానికి ప్రతి గ్రామ గ్రామం నుంచి భారీ ఎత్తున తరలిరావాలని వారికి అన్ని ఏర్పాట్లు తాము చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తన విజయానికి తనతో పాటు నడిచే అందరిని కూడా ఎల్లవేళలా గుర్తుంచుకుంటానని నాతో పాటు ఉండే అందరికీ కూడా తాను అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.

కార్యక్రమంలో వనపర్తి కాంగ్రెస్ అధ్యక్షులు రవికుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు రాధాకృష్ణ, వెంకటేష్ బ్రహ్మచారి, సర్పంచులు, శ్రీనివాస్ రెడ్డి, రాధాకృష్ణ, రమేష్ యాదవ్, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు సత్య రెడ్డి, సతీష్, రాములు, అచ్యుత రామారావు, రమేష్ గౌడ్, రంజిత్,వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్, సురేందర్ గౌడ్, శంకర్ నాయక్, శ్రీహరి గట్టు యాదవ్, సతీష్ యాదవ్ , ఎంపీటీసీలు, మాజీ ఎంపిటిసిలు, సింగిల్ విండో డైరెక్టర్లు, మాజీ సింగిల్ విండో డైరెక్టర్లు, మాజీ సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు