కట్టెలకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

టేకులపల్లి, సెప్టెంబర్ 14( జనం సాక్షి ): అడవిలో గుట్టకు కట్టెల కోసం వెళ్లి ప్రమాదపు శాత్తు కాలుజారి పడిపోవడంతో బలమైన గాయాలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుమ్మలచెలక గ్రామానికి చెందిన ఊకే భాస్కర్(38) ఈనెల 11వ తారీఖున కట్టెల కోసం అడవికి వెళ్లాడు. మూడు రోజులుగా భాస్కర్ ఆచూకీ కోసం వెతుకులాడగా గురువారం ఉదయం అడవిలో శవమైకనిపించాడు. కిందకు ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోవడంతో తగిలిన దెబ్బలను చూసి కట్టెలు కొట్టే క్రమంలో గుట్టపై నుండి కాలుజారి పడిపోవడంతో బలమైన గాయాలు కావడంతో మృతి చెందినట్లు గుర్తించారు. భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు టేకులపల్లి ఎస్సై రమణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాజావార్తలు