వినాయక ఉత్సవ కమిటీలకు పలు సూచనలు..
పరిమిషన్లు తప్పనిసరి – ఎస్ఐ కొగిల తిరుపతి కేసముద్రం-సెప్టెంబర్ 15- జనం సాక్షి : మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు,వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు స్థానిక ఎస్సై కోగిల తిరుపతి పలు సూచనలు చేశారు.వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టేవారు తప్పనిసరిగా స్థలం యొక్క యజమాని తో పర్మిషన్,కరెంటు డిపార్ట్మెంట్,పోలీస్ వారి పర్మిషన్ పొందవలసి ఉంటుందని అన్నారు.వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహం పెట్టే ప్రదేశము,విగ్రహం యొక్క ఎత్తు,నిమజ్జనం చేసే తేదీ,సభ్యుల యొక్క పేర్లు ఫోన్ నెంబర్లతో
కూడిన సమాచారం తో కేసముద్రం పోలీస్ స్టేషన్కు వచ్చి సంప్రదించవలసినదిగా స్థానిక ఎస్సై కోగిల తిరుపతి తెలియజేశారు.